హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టెస్ట్ కు 1500 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 360 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుండగా, 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. స్టేడియంలోకి ఒకసారి వచ్చి బయటకు వెళ్తే మళ్లీ ప్రవేశం ఉండదని పోలీసులు తెలిపారు.
కాగా, హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. నాలుగు రోజులుగా ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. స్టేడియంని అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముస్తాబు చేసింది. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతి కలిగేలా సీటింగ్, రూప్ టాప్స్, స్కోర్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసింది.