టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్‌ టూర్‌కు స్టార్ బౌలర్ దూరం

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డే తో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే… బంగ్లాదేశ్ తో తొలి వన్డే కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్ పెసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ కు ముందు ప్రాక్టీస్ లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయం అయినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడికి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు టెస్ట్ సిరీస్ కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ పర్యటనకు సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ సెషన్ లో షమీ చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. షమీ భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్ కు వెళ్లలేదు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పిటిఐతో పేర్కొన్నారు.