హీరోయిన్ నిధి అగర్వాల్ నిండైన అందాలతో పుష్టిగా ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్ తో బ్రేక్ వచ్చినా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దానితో కొంచెం అందం మందంగా ఉండే వారిని అభిమానించే కోలీవుడ్ కు తరలి వెళ్ళింది. ఇక తెలుగు లో ఎప్పుడో ఒకే చేసిన పవన్ కళ్యాణ్ సినిమా అయిన హరి హర వీరమల్లు చిత్రం ఒకటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉంది.
ఇక కోలీవుడ్ లో కూడా ఆమె కెరియర్ ఆశించిన విధంగా లేదని తెలుస్తోంది. శింబుతో చేసిన ఈశ్వరన్ చిత్రం కూడా హిట్ కాలేదు.. ఇక రవి సరసన నటించిన సినిమా ఓటీటీలో విడుదల కావడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.తాజాగా ఉదయ నిధి స్టాలిన్‌తో జతకట్టిన కలగ తలైవన్ కూడా నిధి అగర్వాల్ కు హిట్ సాధించలేదు.
ఈ చిత్రం కూడా ఆమె కెరియర్ కు ఉపయోగపడకుండా పోయింది. దీంతో నెక్ట్స్ ఏంటి అనే ఆలోచనలో పడ్డ నిధి అగర్వాల్ తాజాగా ఒక హీరో కోసం తెగ ట్రై చేస్తోంది. ఆయనే హీరో ధనుష్. ఆయన్ని బుట్టలో వేసుకునే పనిలో పడింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ధనుష్ పక్కన హీరోయిన్ గా చేయాలని ఆశగా ఎదురు చూస్తూ వున్నానని చెప్పుకొచ్చింది. అలాగే ధనుష్‌తో నటించే అవకాశం వస్తే డబ్భులు కూడా తీసుకోను అని, ఆయన అంటే నాకు విపరీతైన పిచ్చి అని తన మనుసులో మాట చెప్పింది.