భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆటగాళ్ల కెరీర్ ను నాశనం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గాయాలు అయినా ఐపిఎల్ ఆడుతున్నారు కానీ టీం ఇండియాకు మాత్రం ఆడటం లేదని ఎద్దేవా చేశారు. చిన్న గాయం అయినా టీం ఇండియాలో రెస్ట్ తీసుకుంటారు కానీ.. ఐపీఎల్ లో మాత్రం ఆడతారని అన్నారు.
ఐపీఎల్ గొప్పదే అయినప్పటికీ ఇదే సమయంలో ఈ లీగ్ మిమ్మల్ని పాడుచేస్తుందని అన్నారు. క్రికెట్ బోర్డులో ఏదో లోపం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. జస్ప్రీత్ బూమ్రా భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంపై ఆయన బీసీసీఐని ప్రశ్నించారు. ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న బూమ్రా ఫిట్నెస్ ఎలా ఉందో తెలియదన్నారు. రిషబ్ పంత్, బుమ్రా ఉండి ఉంటే జట్టు బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.