గుడివాడలో రావి-రాము దూకుడు..కొడాలికే అడ్వాంటేజ్.!

-

గుడివాడలో రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టి‌డి‌పి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఏదొక విధంగా కొడాలిని నెగిటివ్ చేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుడివాడ పరిధిలో రోడ్లు జలమయం అయ్యాయి. బస్టాండ్ లో కూడా మోకాళ్ళ లోతులో నీరు చేరింది. అటు గుడివాడ పరిధిలో పొలాలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ అంశాలని టార్గెట్ చేసుకుని కొడాలిపై టి‌డి‌పి విరుచుకుపడుతుంది. చిన్న వానకే గుడివాడ బస్టాండ్ చెరువు అవుతుందని, రోడ్లు కాల్వలు అవుతున్నాయని, ఇది గుడివాడలో కొడాలి చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే నష్టపోయిన రైతులని ఆదుకోవడం లేదని కనీసం పరామర్శించడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇక ఓ వైపు టి‌డి‌పి ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు..గుడివాడ లోని పంట పొలాలని పరిశీలిస్తూ రైతుల గోడు వింటున్నారు. ఇటు టి‌డి‌పి నేత వెనిగండ్ల రాము.. రైతుల విజ్ఞప్తుల మేరకు కాలువల పూడికతీతకు సొంత ఖర్చులతో ప్రొక్లేన్లు ఏర్పాటు చేస్తున్నారు.

గుడివాడలో డ్రైనేజీ వ్యవస్థను కాపాడుకోలేనీ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందని, సొంత ఖర్చులతో 30 కిలోమీటర్ల పైగానే కాలువల్లో, డ్రైన్లలో పూడికలు తీయించామని రాము చెప్పుకొచ్చారు. పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని వెనిగండ్ల రాము డిమాండ్ చేశారు. అయితే గుడివాడకు కొత్త బస్టాండ్ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. అటు రోడ్లని సైతం బాగు చేయించే దిశగా పనిచేస్తుంది. నష్టపోయిన రైతులని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది.

కాబట్టి టి‌డి‌పి నేతలు ఎంత రాజకీయం చేసిన ఉపయోగం లేదని కొడాలి అనుచరులు అంటున్నారు. అలాగే టి‌డి‌పిలో ఇలా ఇద్దరు నేతలు పోటీ పడుతూ రాజకీయం చేస్తూ..సీటు కోసం కుమ్ములాటలకు దిగేలా ఉన్నారు. అదే జరిగితే టి‌డి‌పికే నష్టం. ఆటోమేటిక్ గా కొడాలికి అడ్వాంటేజ్.

Read more RELATED
Recommended to you

Latest news