IPL 2023 : ఇవాళ ఐపిఎల్ లో రెండు మ్యాచ్ లు.. జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ ఐపిఎల్ లో రెండు మ్యాచ్ లు..జరుగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు కోల్‌కతా వర్సెస్‌ గుజరాత్.. జట్ల మధ్య భీకర పోరు జరగనుంది. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అటు ఢిల్లీతో తలపడనుంది హైదరాబాద్‌. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇక ఈ మ్యాచ్ లోనైనా సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందో లేక ఓటమిపాలై… పాయింట్లు పట్టికలో చిట్ట చివరన నిలుస్తుందో చూడాలి.  కాగా ఇటీవలే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ జట్టుపై అవలీలగా గెలిచింది. మరి ఈ మ్యాచ్లో గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news