IPL 2025 KL Rahul Leaving Lucknow Super Giants For Royal Challenger: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే లక్నో జట్టును కేఎల్ రాహుల్ వీడాలని అనుకుంటున్నారట. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెళ్లాలని కేఎల్ రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డిసెంబర్లో జరిగే మెగా వేలంలో… కేయల్ బెంగళూరు కొనే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఐపీఎల్ 2025 టోర్నమెంటులో బెంగళూరు కెప్టెన్ గా రాహుల్… కొనసాగే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో బెంగళూరు జట్టులో కేఎల్ రాహుల్ ఆడారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టుకు అనంతరం లక్నోకు కెప్టెన్ అయ్యాడు. అయితే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో… కేల్ రాహుల్ ను లక్నో ఓనర్ తిట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు నుంచి బయటికి రావాలని… రాహుల్ అనుకుంటున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.