టెస్టులో దూసుకపోతున్న జో రూట్.. వరుస రికార్డ్స్..!

-

ప్రస్తుత క్రికెట్ తరంలోని ఫ్యాబ్ 4 లో ఒక్కడైనా ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ ఫార్మాట్ లో దూసుకపోతున్నాడు. వెస్టిండీస్ తో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో అర్ధ శతకం స్ఫహించిన రూట్ 12 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 7వ బ్యాటర్ గా రెండో ఇంగ్లిష్ క్రికెటర్ గా నిలిచాడు. అయితే జో రూట్ ఇంగ్లాండ్ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత కొంత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. దాంతో వైట్ బాల్ ఫార్మాట్ లో చోటు కోల్పోయాడు.

తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించలేకపోయాయడు. కానీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం దూసుకపోతున్నాడు. విండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో సెంచరీ చేసిన రూట్ 39 శతకాలతో స్మిత్, కేన్ విలియమ్సన్ లను సమం చేసాడు. కానీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే ఫ్యాబ్ 4 లోని బ్యాటర్లలో అత్యధిక టెస్ట్ సేన్హరీలు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు రూట్.

Read more RELATED
Recommended to you

Latest news