గంభీర్ కు బిగ్ షాక్..బీసీసీఐకి కోహ్లీ, రోహిత్ ఫిర్యాదు !

-

టీమిండియా కొత్త కోచ్‌ గంభీర్‌ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బిగ్‌ షాక్‌ ఇచ్చారని సమాచారం. కోచ్ గా బాధ్యతలు చేపట్టే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి గంభీర్ ఆదనపు అధికారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను జట్టు ఎంపికలో అధిక జోక్యం చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ వారసుడిగా సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఆటగాడిగానే కొనసాగించాలని గంభీర్ నిర్ణయించినట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది.

Kohli and Rohit complain to BCCI

శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బూమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ కు సీనియర్ ఆటగాళ్ళంతా అందుబాటులో ఉండాలని గంభీర్…. సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హోమ్ సీజన్ కు ముందు అతను ఎన్సీఏ వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. తాము శ్రీలంక టూర్‌ కు వెళ్లబోమని.. గంభీర్‌ పై బీసీసీఐకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news