శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 391 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది.
అయితే చేదనలో శ్రీలంక జట్టు 73 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, ఎనిమిది సిక్స్ లతో 166 పరుగులు బాదాడు కోహ్లీ. ఇది అతని కెరీర్ లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో పాక్ పై 183 కొట్టాడు. అలాగే, ఈ ఇన్నింగ్స్ తో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్ స్వదేశంలో సచిన్ 20 సెంచరీలు బాధగా, కోహ్లీ 21 సెంచరీలు నమోదు చేసి, రికార్డు సృష్టించాడు.