వినేశ్‌.. రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకో: మహవీర్‌ ఫొగాట్

-

‘‘తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయం పట్ల యావత్ భారతావని నిరాశ చెందుతోంది. ఈ క్రమంలో ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతూ వినేశ్ ఫొగాట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మహవీర్‌ ఫొగాట్ సూచించారు. ఆమెతో కూర్చొని మాట్లాడి నిర్ణయం మార్చుకునేలా చూస్తానని తెలిపారు. అంతకుముందు వినేశ్ అనర్హత వేటుకు గురైన తర్వాత మహావీర్ మాట్లాడుతూ.. ఎవరైనా రెజ్లర్‌ 50-100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని అన్నారు. అయితే, అక్కడ రూల్స్‌ మాత్రం అలా ఉండటంతో వేటు పడిందని తెలిపారు. ఏదొక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుందని.. ఆమెను తదుపరి ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధం చేస్తానని వెల్లడించారు. కానీ ఇంతలోనే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news