ఆస్ట్రేలియా క్రికెట్: డేంజరస్ ప్లేయర్ మాక్స్ వెల్ కు గాయం … !

-

ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్యన మూడు టీ 20 లు మరియు అయిదు వన్ డే లు జరగనున్నాయి. అందులో భాగంగా మొదటి టీ 20 మ్యాచ్ డర్బన్ వేదికగా ఆగష్టు 30వ తేదీన జరగనుంది. ఇప్పటికే యాజమాన్యాలు తమ స్క్వాడ్ ను ప్రకటించగా, ఈ రోజు ఆస్ట్రేలియా క్రికెట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం డేంజరస్ ప్లేయర్ గ్లేన్ మాక్స్ వెల్ కు మడమ గాయం కావడంతో ఇతను టీ 20 సిరీస్ కు దూరం కానున్నాడు. ఇతని ప్లేస్ లో కీపర్ బ్యాట్స్మన్ వెడ్ ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే గాయం చిన్నదే అయినప్పటికీ.. అక్టోబర్ నవంబర్ లలో ఇండియాలో వరల్డ్ కప్ ఉండడంతో ముందు జాగ్రత్తగా మాక్స్ వెల్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే మాక్స్ వెల్ డర్బన్ లో ట్రైనింగ్ సెషన్ లో ఉండగా ఈ గాయం తగిలింది. మరి వన్ డే సిరీస్ కు దూరంగా ఉంటాడా లేదా ఆడుతాడా అన్నది రిపోర్ట్స్ ను బట్టి తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news