వీల్​ఛైర్​లో మైక్​టైసన్​.. ఆందోళనలో ఫ్యాన్స్​

-

వరల్డ్ మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్​ టైస్​ అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నిజమో కాదో తెలియని అయోమయంలో ఉన్న ఫ్యాన్స్​కు మైక్​ ఓ క్లారిటీ ఇచ్చారు. మైక్ టైసన్ టీవల మియామి విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో కనపడడంతో అతడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.

అయితే తాను సయాటికా సమస్యతో బాధపడుతున్నట్లు తాజాగా టైసన్‌ వెల్లడించాడు. ఈ సమస్య వల్ల వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రమైనప్పుడు తాను నడవలేనని కనీసం మాట్లాడలేనని, ప్రస్తుతం బాగానే ఉన్నానని టైసన్‌ తెలిపాడు.

ఇటీవలే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్ సినిమాలో విలన్​గా మైక్ టైసన్ నటించారు. ఆ సినిమా చిత్రీకరణ ముగిసినప్పటి నుంచే టైసన్ ఆరోగ్యం కాస్త బాగాలేనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా టైసన్ త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news