ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఆదివారం ఇంగ్లండ్, ఇండియాల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో వన్డే మ్యాచ్ జరగనుండగా.. అందులో భారత జట్టు ఆటగాళ్లు నూతనంగా డిజైన్ చేయబడిన ఆరెంజ్ కలర్ జెర్సీలను ధరించనున్నారు.
టీమిండియా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ధరించే నీలి రంగు జెర్సీ. ఎన్నో ఏళ్ల నుంచి ఆ డ్రెస్ డిజైన్లు మారాయి కానీ.. కలర్ మాత్రం అదే ఉంటూ వస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో టీమిండియా జెర్సీ మారనుంది. అయితే అది కేవలం కొన్ని మ్యాచ్‌లకే. నీలి రంగులో ఉన్న జట్లతో ఆడేటప్పుడు మాత్రమే టీమిండియా వేరే కలర్ జెర్సీ ధరిస్తుందని గతంలో చెప్పారు. అయితే మొన్నీ మధ్య జరిగిన ఆప్గనిస్థాన్ మ్యాచ్‌లో ఆ జట్టు వేరే కలర్ జెర్సీలు ధరించినందున ఇండియా తమ పాత జెర్సీలనే ధరించింది. కానీ ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా నూతన రంగు జెర్సీలను ధరించనుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఆదివారం ఇంగ్లండ్, ఇండియాల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో వన్డే మ్యాచ్ జరగనుండగా.. అందులో భారత జట్టు ఆటగాళ్లు నూతనంగా డిజైన్ చేయబడిన ఆరెంజ్ కలర్ జెర్సీలను ధరించనున్నారు. కాగా ఈ జెర్సీలను ఇవాళే నైకీ ఇండియా విడుదల చేసింది. ఈ కంపెనీ బీసీసీఐ, భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీమిండియా ధరించబోయే ఆరెంజ్ కలర్ జెర్సీని నైకీ ఇండియా విడుదల చేసింది.
ఇంగ్లండ్ జట్టు స్కై బ్లూ కలర్ జెర్సీలను ధరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఆ జట్టు ఆతిథ్య జట్టు కనుక వారికి ఏ జెర్సీనైనా ధరించే స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు అదే కలర్ జెర్సీలను ధరించనున్నారు. ఈ క్రమంలో ఆ జట్టుతో ఆడే.. అదే తరహా జెర్సీలు కలిగిన జట్లు తమ జెర్సీల కలర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే టీమిండియా ఆదివారం మ్యాచ్‌లో నూతన రంగు జెర్సీలను ధరించనుంది. కాగా ఈ జెర్సీల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!