PAK VS SL: మొదటిరోజే చాపచుట్టేసిన శ్రీలంక … !

-

ఈ రోజు శ్రీలంక వేదికగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్యన మొదలైన రెండవ టెస్ట్ లో టాస్ ఓడిపోయిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది.. మొదటి ఓవర్ నుండి పూర్తి ఆత్మసంరక్షణలో ఆడిన శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. గత టెస్ట్ లో లంకను ఆదుకున్న ధనుంజయ డిసిల్వా ఈ మ్యాచ్ లోనూ అర్ధ సెంచరీ తో కొంతసేపు పాకిస్తాన్ ను అడ్డుకోగలిగాడు.. ఒక్కసారి డిసిల్వా అవుట్ అవ్వగానే శ్రీలంక ఆల్ అవుట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. మరోసారి శ్రీలంక ఓపెనర్లు నిరాశపరచగా … మెండిస్ , మత్యుస్ లు కూడా చేతులెత్తేశారు.. చండీమల్ (34) కాసేపు డిసిల్వాకు అండగా ఉన్నాడు. అలా చివరికి శ్రీలంక కేవలం 48 .4 ఓవర్ లలో 166 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4, నసీం షా 3 వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ బ్యాటింగ్ లో రెండు వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది.

 

ఇప్పటికే మొదటి టెస్ట్ లో ఓడిపోయిన శ్రీలంక కనీసం ఈ మ్యాచ్ లో గెలిచి పాకిస్తాన్ కు సిరీస్ లో గట్టిపోటీ ఇవ్వాలన్న ప్రయత్నాలు సఫలం అయ్యేలా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news