పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ను వాలంటీర్లు అంతా దుర్భాషలతో , నిరసనలతో గందరగోలాన్ని సృష్టించారు. కాగా పవన్ కళ్యాణ్ పై నిన్న ఒక మహిళా వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్ట్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. కేసు పెట్టిన అనంతరం ఈమె పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వాలంటీర్ మాట్లాడుతూ.. వాలంటీర్ గా మారినప్పటి నుండి మేము మాకు నిర్దేశించిన ప్రజలకు సేవ చేస్తున్నాము… ఎవ్వరూ చేయనంతగా తెల్లవారు జామున వారింటికి వెళ్లి, నిదర లేపి మరీ పెన్షన్ ఇస్తున్నాము అంటూ ఆవేదనతో మాట్లాడింది. మా కుటుంబాల కన్నా మాకు ఇచ్చిన 50 కుటుంబాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కష్టపడుతుంటే మా గురించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో కరోనా వచ్చి మనిషికి మనిషి మాట్లాడుకోవడమే మానేస్తే.. మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారికి సేవలు చేశాము అంటూ తమ బాధను వివరించింది. ఇకనైనా పవన్ మా బాధను అర్ధం చేసుకుని ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అంది.