సాధారణంగా క్రీడల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేదు.. ఓవైపు క్రీడాకారులు ఆడేది ఒక ఎత్తయితే.. మరోవైపు వాళ్లు గెలుపు, ఓటమి లపై బెట్టింగ్ జరుగుతుంటుంది. ఇలా రకరకాలుగా చోటు చేసుకుంటుంది. అయితే ఓ నటి మాత్రం భారత్ ను ఓడిస్తే.. బంగ్లా క్రికెటర్ తో డేటింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్లితే.. ఐసీసీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి .. డేరింగ్ ప్రామిస్ చేసింది. ఒకవేళ ఇండియాను ఓడిస్తే, బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేయనున్నట్లు ఆమె ప్రకటించింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె ఈ ప్రకట చేసింది. ఒకవేళ ఇండియా ఓడితే, ఢాకా వెళ్లి బంగ్లా బాయ్‌తో ఫిష్ డిన్నర్ చేయనున్నట్లు చెప్పింది.