కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం : కేసీఆర్

-

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో నాటి క‌రువును త‌లుచుకొని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోన‌య్యారు. మ‌న‌షులే కాదు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ చెట్లు కూడా బ‌క్క ప‌డిపోయాయ‌ని బాధ ప‌డ్డామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. అనేక సంద‌ర్భాల్లో క‌న్నీళ్లు పెట్ట‌కున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. 

కృష్ణా ప‌క్క‌నే పారుతున్నా.. ముఖ్య‌మంత్రులు రావ‌డం, ద‌త్త‌త తీసుకోవ‌డం, శిలాఫ‌లకాలు వేయ‌డం త‌ప్ప ఏం లాభం జ‌ర‌గ‌లేదు. ఉద్య‌మంలో నేనే పాట రాసినా.. ప‌క్క‌న కృష్ణ‌మ్మ ఉన్న ఫ‌లిత‌మేమి లేక‌పాయే పాల‌మూరు, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం మెట్టు పంట‌లు ఎండే అని పాట కూడా రాశాను.  అయితే తెలంగాణ వచ్చాక అభివృద్ధి సాధించుకున్నాం. హైదరాబాద్ కి సమీపంలో ఉన్న జడ్చర్లను ఐటీ హబ్, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అన్నారు. 

మళ్లీ  కాంగ్రెస్ వస్తే.. కరెంట్ కష్టాలు.. రైతుబంధుకు రామ్ రామ్ అంటారు.  ఎన్నికల తరువాత జీవో తీసుకొస్తామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కర్ణాటకలో 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు కర్ణాటక సీఎం 5 గంటలు కరెంట్ ఇస్తాం సరిపెట్టుకోండని పేర్కొంటున్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటలు ఎందుకు అంటున్నాడు.. 3 గంటలు చాలు అన్నాడు. కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news