ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. భారత్ ఇప్పటివరకు 7 పథకాలు సాధించింది. ఇక ఐదో రోజు భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, బ్యాట్మెంటన్ తర్వాత అథ్లెటిక్స్ లో కూడా పథకాలు వస్తున్నాయి. తాజాగా భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల డిస్కస్ త్రో f-56లో టోక్యో పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడు యోగేష్ కతునియా 42.22 మీటర్ల త్రో తో మరోసారి సిల్వర్ సొంతం చేసుకున్నాడు.
ఈ పారాలింపిక్స్ లో ఇండియా ఇప్పటివరకు ఒక గోల్డ్, మూడు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ -1 ఈవెంట్ లో అవని లేఖరా భారత్ కు బంగారు పతకాన్ని సాధించింది. మోనా అగర్వాల్ అదే ఈవెంట్ లో కాంస్యం సాధించింది.
ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మనీష్ నర్వాల్ రజత పథకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెటిక్స్ మహిళల t-35 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్య పథకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ వన్ విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం దక్కించుకుంది. పాయింట్స్ టేబుల్ లో 30వ స్థానంలో ఉంది భారత్.