వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యపేట జిల్లాలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రివ్యూకు హాజరయ్యారు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులు చాలా కష్టపడ్డారు. మంత్రులు కూడా చాలా కష్టపడ్డారు. వర్షాలు, వరదల వల్ల కష్టపడిన మంత్రులకు, అధికారులను అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
చనిపోయిన ప్రతీ కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. పశువులు చనిపోతే రూ.50వేలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశువులు, మేకలు, గొర్రెలు నల్లగొండ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. మేకలు, గొర్రెలు చనిపోతే రూ.5వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని ఎకరాలు నీటిలో మునిగిపోతే అన్ని ఎకరాలకు రూ.10వేల చొప్పున చెల్లించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ రాత్రి ఖమ్మంకి వెళ్లి అక్కడే బస చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.