టి20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించిన పీసీబీ… ఇక ఇండియాకు వణుకు పుట్టాల్సిందే !

T20 World cup 2022 : ప్రపంచ కప్-2022 కు జట్టును ప్రకటించింది. దాదాపు ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లనే మరోసారి కొనసాగించింది. ఎంపిక చేసిన 15 మందిలో ఆసియా కప్ లో విఫలమైన ఫకార్ జమాన్ కు చోటు దక్కకపోగా, గాయంతో టోర్నీలో దూరమైన షాహిన్ ఆఫ్రిది తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు మరో అవకాశం ఇస్తుందని వార్తలు వచ్చిన, కనీసం స్టాండ్ బై ఆటగాడిగా కూడా ఎంపిక చేయలేదు.

పాకు టి20 ప్రపంచ కప్ జట్టు విషయానికి వస్తే, 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టుతో పాటు, స్టాండ్ బైగా ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేశారు. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైనా స్టార్ పెసర్ షాహిన్ షా ఆఫ్రిది, టి20 వరల్డ్ కప్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. టి20 వరల్డ్ కప్ సమయానికి అతను కోలుకుంటాడా? లేదా? అన్న సందేహాలు రేగిన అతను వేగంగా కోలుకోవడంతో వచ్చే నెలలో జరిగే పొట్టి ప్రపంచ కప్ లో బరిలో దిగుతాడని స్పష్టం చేసింది పాకిస్తాన్. ఇక ఫకర్ జమాన్ ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోగా, రిజర్వ్ జాబితాలో చోటు కల్పించారు.

టీ20 ప్రపంచకప్ జట్టు : బాబర్ అజామ్ (సి), షాదాబ్ ఖాన్ (విసి), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ అఫ్రి , షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్