టెస్టు మ్యాచ్‌లో.. హాఫ్ సెంచ‌రీలో 9 ఫోర్లు.. 1 సిక్స‌ర్‌

-

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర పుజారా మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమ‌య్యారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. 106 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఫ‌స్ట్ స్లోగా ఆడినా త‌ర్వాత దూకుడు చూపించారు. ఈ క్ర‌మంలోనే పుజారా హాఫ్‌ సెంచరీ సాధించే క్రమంలో 9 ఫోర్లు, 1 సిక్స్‌ సాధించడం విశేషం. పుజారా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 42 పరుగులు ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడు. ఇక అంత‌కు ముందు రోహిత్‌ శర్మ హాఫ్‌సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులే చేసి ఆరంభంలోనే ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌కు జత కలిసిన పుజారా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ లయ తప్పిన బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించారు. ఈ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండో వికెట్‌కి ఈ జంట 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. భారత్ జట్టు ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version