ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. మాల్దీవ్స్ ప్లేయర్ పై విజయం

-

పారిస్‌ ఒలింపిక్స్‌ను ఇండియన్ స్టార్‌ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నమెంట్ను సింధు విజయంతో గ్రాండ్గా షురూ చేసింది. మాల్దీవ్స్ ప్లేయర్పై ఈజీగా గెలిచింది. . తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై సింధు అలవోకగా విజయం సాధించింది. సింధుకు రజాక్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడంతో వరుస గేమ్‌ల్లో సింధు గెలిచింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌ను సింధు 21-9, 21-6 తేడాతో ఘన విజయం సాధించింది.

మరోవైపు ఇవాళ జరుగుతున్న పోటీల్లో రోయింగ్‌లోని రిపెఛేజ్‌ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌రాజ్‌ పన్వార్ సత్తా చాటాడు. రెండో రౌండ్‌లో అద్భుత పర్ఫామెన్స్ ఇచ్చి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. మొనాకో అథ్లెట్‌ క్వింటిన్ ఆంటోగ్నెల్లి తొలి స్థానం సాధించగా.. రెండో స్థానంతో బాల్‌రాజ్‌ క్వార్టర్స్‌కు దూసుకుపోయాడు. ఇంకోవైపు ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ టీమ్ తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. బాక్సింగ్‌ ఈవెంట్లోమహిళల 54కేజీ విభాగంలో ప్రీతి పవార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news