ఇకపై ప్రతి మ్యాచ్ సెమీఫైనల్ అనుకునే ఆడతామని ఆర్సిబి కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. ‘SRHతో మ్యాచ్ మాకు కఠినమైనది. ఆ ఓటమి మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టింది. కానీ ఆ మ్యాచ్ లో మా మిడిలార్డర్ గొప్పగా పోరాడింది. మా జట్టు పోరాడినందుకు గర్వంగా ఉంది. తర్వాతి మ్యాచ్లకు బలంగా తిరిగి వస్తాం. వరుస విజయాలు సాధించి గాడిలో పడతాం’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, SRHతో మ్యాచ్ లో RCB సరికొత్త రికార్డు నమోదు చేసింది. చేదనలో 250+రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో RCB పోగొట్టుకున్న అత్యధిక స్కోర్ (263) రికార్డును ఇది భర్తీ చేసినట్లు అయింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో RCB అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసిన SRH (277)….నిన్నటి మ్యాచ్ లో 287 కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమ రికార్డు బ్రేక్ చేసిన జట్టుపైనే RCB కొత్త రికార్డు సాధించడం గమనార్హం.