బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా తాజా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీలో ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన వార్నర్ తిరిగి బ్యాగీ గ్రీన్ ధరించేందుకు సన్నద్ధత వ్యక్తం చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ తో ఆసీస్ ఓపెనర్ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే.
ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా స్టీవ్ స్మితన్ను ప్రయోగించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదు. దీంతో వార్నర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. కోడ్ స్పోర్ట్స్ అనే వెబ్సైట్తో వార్నర్ మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నాడు. సెలెక్టర్ల నుంచి ఫోన్ రావడమే ఆలస్యమని ప్రకటించాడు.
బీజీటీకి ముందు ఆఫీస్కు ఓపెనింగ్ సమస్యతో పాటు కామెరూన్ గ్రీన్ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఉస్మాన్ ఖ్వాజా జోడీ కోసం ఆసీస్ సెలక్టర్లు సామ్ కోన్స్, మార్కస్ హ్యారిస్ పేర్లను పరిశీలిస్తున్నారు. తాజాగా వార్నర్ ప్రకటన నేపథ్యంలో ఆసీస్ సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.