సూర్య కుమార్ ని బెంచ్ కి పరిమితం చేయడం సరికాదు – అజారుద్దీన్

సూర్య కుమార్ యాదవ్ ఆస్ట్రేలియా సిరీస్ లో కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్. ఓ ఆటగాడు ఫామ్ లో ఉన్నప్పుడు అతడిని బెంచ్ కి పరిమితం చేయడం సరికాదన్నారు. సూర్య కుమార్ యాదవ్ అన్ని ఫార్మాట్లకు తగ్గ ఆటగాడని కొనియాడారు.

” ఇటీవల ప్రదర్శన ఆధారంగా ఇషాన్ కిషన్ ను ఆసీస్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయడం బాగుంది. వికెట్ కీపర్- బ్యాటర్ స్థానానికి ఇషాన్ బలమైన పోటీదారు. అలాగే సూర్య కుమార్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషిస్తాడు. ఆటగాడు ఫామ్ లో ఉన్నప్పుడు అతడిని బెంచ్ కి పరిమితం చేయడం సరికాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాగా సూర్య కుమార్ యాదవ్ అన్ని ఫార్మర్లు అడగలడు. అయితే వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది” అన్నారు అజారుద్దీన్.