ఇదంతా వరల్డ్ కప్ కోసమే కదా బ్రో.. దినేశ్ ను టీజ్ చేసిన రోహిత్

-

ముంబయి ఇండియన్స్ – బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముంబయి బౌలర్ బుమ్రాతో పాటు ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు చేసిన దినేష్.. తన విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. భారీ షాట్లతో ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో అయితే ఇన్నోవేటివ్ షాట్స్‌ బాది పిచ్చెక్కించాడు. నాలుగు బౌండరీలు తరలించాడు. అయితే ఈ నాలుగు బౌండరీలను కూడా థర్డ్ మ్యాన్ రిజీయన్‌లోనే రావడం విశేషం.

ఈ మ్యాచులో దినేశ్ కార్తీక్ను ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటపట్టించాడు. బుమ్రా(5/21) ఓ వైపు నిప్పులు చెరుగుతున్నా తన హిట్టింగ్‌తో ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు దినేశ్ కార్తీక్. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో ఆర్సీబీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి సమయంలోనూ ఆఖరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్‌ కొట్టడంతో దినేష్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ అతడిని మెచ్చుకుంటూ సరదాగా టీజ్ చేశాడు. ఆ సమయంలో హిట్ మ్యాన్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. శెభాష్ డీకే ప్రపంచకప్ ఆడేందుకే కదా ఇలా రెచ్చిపోతున్నావ్ అంటూ టీజ్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news