తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకే ఆల్ అవుట్ కాగా… తర్వాత చేదనకు దిగిన టీమిండియా లక్షాన్ని 18.4 ఓవర్లలోనే చేదించింది. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద… ఇంగ్లాండ్ వన్డే చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓడించింది ఇండియా.ఇప్పుడు వరకు వన్డేల్లో ఇంగ్లాండ్ స్వదేశంలో ఎప్పుడూ కూడా 10 వికెట్ల తేడాతో ఓడిపోలేదు.
కానీ నిన్నటి మ్యాచ్ లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి… అప్రదిష్ట మూటగట్టుకుంది. ఓపెనరర్లు రోహిత్ శర్మ 76 నాటౌట్, దావన్ 31 నాటౌట్ అజేయంగా నిలిచారు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్ కారణంగా ఓ చిన్నారికి గాయం అయింది.
ఇన్నింగ్స్ 5 వ ఓవర్ లో డేవిడ్ విల్లీ వేసిన ఓ బంతిని ఫుల్ షాట్ ఆడాడు రోహిత్. ఈ నేపథ్యంలోనే.. ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ పాపకు బలంగా తాకింది. దీంతో ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిలలాడింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
#RohitSharma SIX hits girl in the stand pic.twitter.com/mSm17wyHFK
— Soni Gupta (@SoniGup46462554) July 12, 2022