ఈ సారి పాకిస్తాన్ ను చిత్తు చేస్తాం – రోహిత్ శర్మ

-

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఆసక్తి ఉండటం సర్వసాధారణం. మరి హైవోల్టేజ్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో, అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇదే విషయంపై ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మనే స్పందించాడు. ఆసియా కప్ కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే గతేడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో పాక్ చేతిలో తాము ఓడిపోయిన మాట నిజమే అయిన, ఆసియా కప్ లో అలా జరగదని అన్నాడు. అప్పటికి జట్టులో చాలా మార్పు వచ్చిందని, అక్కడి పరిస్థితి ఆసియా కప్ లో పరిస్థితి వేరని పేర్కొన్నారు.

కాగా, టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో పాక్ తో తలపడింది. ఇప్పుడు టీమిండియాను రోహిత్ శర్మ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జట్టులో మొహమ్మద్ షమీనీ కాకుండా యువ పెసర్ ఆవేష్ ఖాన్ ను తీసుకోవడంపై కూడా రోహిత్ స్పందించాడు. టీమిండియా సీనియర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రాబుమ్రా, మొహమ్మద్ షమీ జట్టులో శాశ్వతంగా ఉండరు కదా, అందుకే యువ బౌలర్లకు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడు జట్టు బెంచ్ కూడా బలపడుతుంది అని రోహిత్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news