సచిన్ టెండూల్కర్ 47వ వసంతంలోకి అడుగు పెట్టడంతో సోషల్ మీడియాలో చాలామంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత్ క్రికెట్ జట్టు చరిత్ర లో తనకంటూ పేజీలు క్రికెట్ ప్రేమికులకు గుర్తుండిపోయేలా క్రియేట్ చేసుకున్నాడు. ప్రపంచ స్థాయిలో అనేక రికార్డులు వేల పరుగులు నమోదు చేసుకున్న ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరు సంపాదించారు. ప్రపంచ స్థాయిలో చాలామందికి ఓ రోల్ మోడల్. కనిపించడానికి పొట్టి గా ఉంటూ భారత్ టీం ని ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సచిన్ టెండుల్కర్ జీవితంలో ఎన్నో సాధించిన కానీ ఒక సంఘటన మాత్రం తాను మర్చిపోలేడు అంటూ మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ చెప్పుకొచ్చారు.
అది ఏమిటంటే 1999వ సంవత్సరంలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ దేశంతో చెన్నై నగరంలో జరిగిన టెస్ట్ మ్యాచ్. ఆ సమయంలో సచిన్ వెన్నునొప్పితో తీవ్రంగా బాధ పడుతున్నాడు. 1999లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగినది. వెన్నునొప్పి ఉన్నాగాని గెలవాలని కసితో సచిన్ 136 పరుగులు చేశాడు. భాగస్వామి నయన్ మోంగియా తో కలిసి 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్ గా మైదానం నుంచి వెనుదిరిగాడు.
ఆ తర్వాత వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడం జరిగింది. 12 పరుగుల తేడాతో ఇండియా టీమ్ ఓడిపోయింది. తాను పడిన కృషికి భారత్ క్రికెట్ టీమ్ పాకిస్థాన్ తో ఓటమి చెందటాన్ని సచిన్ జీర్ణించుకోలేకపోయారట. వెంటనే తన డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి పోయి ఒంటరిగా ఎవరికీ కనిపించకుండా ఒక టవల్ ని అడ్డుపెట్టుకొని సచిన్ టెండూల్కర్ వెక్కి వెక్కి ఏడ్చాడట. ఆ సంఘటన మాత్రం సచిన్ ఎప్పటికీ మర్చిపోలేనిది… అంటూ అప్పటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తెలిపారు.