‘అవకాశం’ అనేది ఎంత ముఖ్యమో .. రీసెంట్ గా జగన్ కి అనుభవం అయ్యింది !

-

దాదాపు పది సంవత్సరాల పోరాటం తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ రాజకీయ రంగంలో అడుగు పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అన్నీ ఎదురు దెబ్బలే. మొట్టమొదటిసారి ఎంపీ అయ్యాక తండ్రి చనిపోవటం. తర్వాత తాను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేలా పరిస్థితులు మారడం, పార్టీ స్థాపించడం తర్వాత జైలుకు వెళ్లడం, తర్వాత రాష్ట్రం విడిపోయి జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం మనకందరికీ తెలిసినదే. అయితే ఏపీ ప్రతిపక్ష నేత గా అనేక పోరాటాలు చేసి గత సార్వత్రిక ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిక అయితే ఇప్పుడు 11 నెలలు కావస్తోంది.YS Jagan Mohan Reddy to speed up the petrochemical region in AP ఇలాంటి టైమ్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ఉన్న సమయంలో కరోనా వైరస్ రూపంలో భయంకరమైన విపత్తు రావడం ఇప్పుడు జగన్ కి పెనుసవాలుగా మారింది. 10 సంవత్సరాల నుండి వెయిట్ చేసిన అవకాశం ప్రజలు రీసెంట్ గా ఇవ్వటంతో వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి శతవిధాల కష్టపడుతున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలావరకూ గాలికి వదిలేయడంతో ప్రజలు ఇంటికి పరిమితం చేశారు. దీంతో ఆ అనుభవాన్ని రీసెంట్ గా జగన్ గుర్తించినట్లు ‘వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం’ ద్వారా అర్థమవుతుంది. భయంకరమైన ఇలాంటి విపత్కర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన హామీ ఏది కూడా గాలికి వదిలేయకుండా అన్నీ నెరవేర్చడానికి జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతుంది.

 

కరోనా వైరస్ తో ఆంధ్రప్రదేశ్ ఖజానా చాలా వరకు ఖాళీ అయిపోయింది అని వార్తలు వస్తున్న సమయంలోనే… వస్తున్న నిధులను ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లల తల్లుల ఎకౌంట్లో జమ చేయడం జరిగింది. తాజాగా మహిళలకు ఇలాంటి విపత్కర సమయంలో కూడా సున్నా వడ్డీ పథకం అమలు చేయడం చూస్తుంటే వచ్చిన సీఎం అవకాశం ఎంత ముఖ్యమో జగన్ బాగా అలవర్చుకున్నటు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షానికి ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకుండా జగన్ వ్యవహరిస్తున్నట్లు ప్రజంట్ జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news