ఒక్క సెంచరి చేస్తే చాలు, సచిన్ తర్వాత కోహ్లీనే…!

-

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా పరుగులు చేస్తూ అనేక ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. మరో సెంచరి సాధిస్తే సచిన్ తర్వాతి స్థానంలో కోహ్లి నిలుస్తాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో భారత్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ ముందు మరో ప్రపంచ రికార్డ్ కైవసం చేసుకునే అవకాశ౦ ఉంది.

ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ సాధిస్తే 42 సెంచరీలు సాధించి సచిన్ తర్వాతి స్థానంలో నిలుస్తాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో కోహ్లి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 సెంచరీలను సమం చేసాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేం స్మిత్ 33 సెంచరీలతో వారి తర్వాతి స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 376 ఇన్నింగ్స్‌లలో 41 సెంచరీలు సాధించగా, కోహ్లీ 196 ఇన్నింగ్స్‌లలోనే

41 సెంచరీలు చేసి ఆశ్చర్యపరిచాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 20 టెస్ట్ సెంచరీలు సాధించగా, ఆటగాడిగా 21 సెంచరీలు సాధించాడు. కెప్టెన్ గా జట్టు భారాన్ని మోయడం, బ్యాట్ తో రాణించడం అనేది సాధారణ విషయం కాదు. కాని కోహ్లీ మాత్రం అటు కెప్టెన్ గా ఇటు బ్యాట్స్మెన్ గా రాణిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో కోహ్లి నాలుగో స్థానంలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. వన్డేల్లో అతని సగటు 59.84 కాగా, కెప్టెన్‌గా 77.60.

Read more RELATED
Recommended to you

Latest news