హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు : కోమటి రెడ్డి

-

యాదాద్రి భువనగిరి జిల్లా : హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడని చురకలు అంటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు నది అంటేనే మూసి, దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతానని పేర్కొన్నారు.

komatireddy venkatreddy

సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే, ఎంపీ గా తనకు సమాచారం ఇవ్వలేదని…ఈ ప్రభుత్వం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రోటోకాల్ ఇవ్వరని మండిపడ్డారు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన ఆడే అబద్ధాలకు నా పరువు పోతుందని ఎద్దేవా చేశారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడిపోయినట్టు అని.. దళితులకు క్యాబినెట్ లో స్థానం లేదు గాని, దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కు తెలుసన్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పాత నల్లగొండ జిల్లా బౌండరీలు తెలుసా? అని ప్రశ్నించారు. ఎంపీ స్థానంలో ఉండి రెండేళ్ల నుండి సిఎం అపాయిట్ మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news