శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్

-

డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్చీలని బ్లూ జట్టు చిత్తు చేసింది.

13 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్లో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొఠారీ 3 వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news