కొన్నేళ్లుగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో, శుబ్ మాన్ గిల్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. శుబ్ మాన్ గిల్ మంచి ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారి వీరిద్దరి మధ్య తంతు నడుస్తుందని పోస్టులు రావడం, సారా హ్యాపీగా ఫీల్ అవుతుందనే కామెంట్లు మీమ్స్, తదితర క్యాప్షన్లు పుంకాలు పుంకాలుగా నెట్టింట ట్రెండ్ అయ్యేవి.
అయితే ఇంతవరకు వీరి మధ్య సంబంధం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. పైగా వీరిద్దరూ కలిసి కనిపించిన సంఘటనలు కూడా పెద్దగా లేవు. అయినా కానీ వీరిమధ్య లింకు ఉందనే విషయం మాత్రం బహిరంగ రహస్యమే. మీరు ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతుంటారు.
అయితే ఆల్ఆఫ్ సడెన్ గా గిల్, సారా ఒకరినొకరు ఇన్స్టాలో అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు పెట్రేగాయి. అలాగే గిల్ సైతం ఇన్స్టాలో హింటిచ్చాడు, నేను నా భవిష్యత్తు మాత్రమే చూసుకుంటా. నా గతాన్ని కాదు. అంటూ ఓ ట్వీట్ చేసి డాట్స్ చాలా పెట్టాడు. దీంతో బ్రేకప్ కన్ఫామ్ అయ్యిందంటూ నేటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.