ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మళ్లీ మోడీనే నంబర్.1

-

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మళ్లీ భారత ప్రధాని మోడీనే నంబర్.1గా వచ్చారు. ప్రధాని మోడీకి 75 శాతం ఓటింగ్‌తో టాప్‌1లో ఉన్నారని ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని పేర్కొంది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు. అమెరికాకు చెందిన సంస్థ సర్వే చేపట్టింది.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

అమెరికా దేశాధ్యక్షడు జోబైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్‌తో 5వ స్థానంలో ఉన్నారు. 63 శాతం ఆమోదంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో 54 శాతం ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి నిలిచారు. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిల్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ తదితర దేశాల్లో మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news