పూణే లో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ విసిరిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఓపెనర్లు ఇద్దరూ కనకానం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ మరియు గిల్ లు వికెట్ పడకుండా టార్గెట్ కొట్టాలని అనుకున్నారో ఏమో కానీ… నెమ్మదిగా ఆడుతూనే సునామీ సృష్టిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఒక సీన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ ను చూడడానికి సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ వచ్చింది.. ఈమె స్టాండ్స్ లో కూర్చుని ఇండియా ను తన కేరింతలతో ఉత్సాహపరుస్తూ ఉంది. కెమెరా యాంగిల్ లో ఇది గమనించిన శుబ్ మాన్ గిల్ వెంటనే రెండు భారీ సిక్సులు కొట్టి తన కోసమే అన్నట్లు అలరించాడు.
మొదటగా రోహిత్ శర్మ కన్నా చాలా నెమ్మదిగా ఆడుతున్న గిల్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. సిక్సులు ఫోర్లతో అలరిస్తూ రోహిత్ శర్మ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే తొందరగానే లక్ష్యాన్ని ముగించేలా ఉన్నారు.