IPL 2024: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది SRH. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో SRH పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు(24), అత్యధిక సిక్సర్లు(11) కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో సస్సెక్స్ పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అలాగే అత్యంత వేగంగా (8.4 ఓవర్లు) 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు(158) చేసిన టీమ్ గా SRH ఘనత సాధించింది. కాగా, 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ జట్టు 67 పరుగులు తేడాతో విజయం లభించింది. మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి వరుసగా మూడు మ్యాచుల్లో 250పైగా స్కోరు చేసిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.