IPL 2023 : హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ దొరికినట్లేనా ?

-

ఐపీఎల్ మినీ వేలం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో కోట్లు కుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సామ్ కర్రన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండు యంగ్ సెన్సేషన్ హారిబ్రూక్ కోసం ఫ్రాంచైజీ లన్నీ పోటీపడ్డాయి.

రూ. 10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు హరి బ్రూక్ కోసం పోటీ పడడంతో ధర అంతకంతకు పెరుగుతూ పోయింది. చివరికి రూ. 13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారి బ్రూక్ ని కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లతో మొదలైన హరి బ్రూక్ దాదాపు పది రేట్లు రెట్టింపు ధర దక్కించుకున్నాడు. భారత బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ని రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే, మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌ చేసేందుకే కావ్య అతన్ని తీసుకుందని టాక్‌ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news