ఇవాళ జరగాల్సిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ కూడా రద్దయింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ క్రమంలో ఇలా వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవడం పట్ల అభిమానులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
”ఏం క్రికెట్ వరల్డ్‌కప్ రా బాబూ.. 4 ఏళ్ల తరువాత వచ్చిన ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లను ఎంతో ఆసక్తిగా చూద్దామనుకున్నాం.. కానీ వర్షం వల్ల టోర్నమెంట్ కళ తప్పిపోయింది. ఓ వైపు మ్యాచ్‌లు చప్పగా.. ఏకపక్షంగా సాగుతున్నాయి.. మరోవైపు ఆ మ్యాచ్‌లనైనా సరే.. చూద్దాం.. అంటే.. వర్షం పడి రద్దవుతున్నాయి. ఈ టోర్నమెంట్‌ను ఈ కాలంలో.. అదీ వర్షాలు ఎక్కువగా పడే ఇంగ్లండ్‌లో ఎందుకు పెట్టారు..? ఐసీసీ విఫలమైంది.. వారికి టోర్నమెంట్‌లను నిర్వహించడం చేతకాదు.. ఐసీసీ పెద్దలు రాజీనామా చేయాలి.. టోర్నమెంట్‌ను మరో దేశానికి తరలించాలి.. వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను పెట్టాలి…”
ఇవీ.. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఐసీసీ పట్ల చేస్తున్న కామెంట్లు.. సోషల్ మీడియాలో.. అందులోనూ.. ట్విట్టర్‌లో ఇప్పుడు చాలా మంది క్రికెట్ అభిమానులు ఐసీసీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. వర్షాకాలం ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్‌ను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇవాళ జరగాల్సిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ కూడా రద్దయింది. టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఈ క్రమంలో రెండు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. కాగా ఇవాళ్టి మ్యాచ్ తో కలిపి ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ క్రమంలో ఇలా వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవడం పట్ల అభిమానులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ICC #CWC19 point table..? #BANvSL pic.twitter.com/qIgl24pd0e
— ⓚⓐⓥⓘ??? (@kavi_yellove) June 11, 2019
1st Semi Final:
Showers vs Light Rain2nd Semi Final:
Clouds vs Heavy RainFinal:
Light Rain vs Heavy Rain
Heavy Rain won by 62 millimeters
Man of the Tournament: Drizzling ?️
Most Wickets: Cloud ?
Most Runs: Showers— Ashwejkhan (@Ashwejkhan) June 11, 2019
The best way to play matches in england pic.twitter.com/7WezE5jHcO
— Pritesh Mishra (@pritesh749) June 11, 2019
U guys should hv planned the fixture properly….. A reserve day for rain affected matches should b there…. Its wc, no ordinary matches…. Think twice
— vikash (@7vikash07) June 11, 2019
So sad
Wait till 4 years for the biggest cricket event
But the rain has destroyed the world cup 19 ????— DaniSh KhAn (@DaniShK57934705) June 11, 2019
Yesterday, Southampton, SA vs WI – Washout.
Today, Bristol, BAN vs SL – Probably washed out.
Tomorrow, Taunton, AUS vs PAK – 50% chance of rain.
Thursday, Nottingham, IND vs NZ – 80% chance of rain.
Washout World Cup.— Dr Mohd Shahid ? (@Hakeem_Rules) June 11, 2019
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో గతంలో ఏ వరల్డ్ కప్‌లో లేని విధంగా ఏకంగా 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీపై మండి పడుతున్నారు. అయితే ఇవే కాదు, మరో 3, 4 రోజుల పాటు ఇంగ్లండ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ చానల్ తెలిపింది. దీంతో అభిమానులు మరింత నిరాశకు గురయ్యే అవకాశం ఉందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా.. ఎప్పుడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌కు తీవ్రంగా నిరాశను కలిగిస్తోంది. తమ అభిమాన టీం మ్యాచ్‌లను చూద్దామంటే.. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. మరి ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఎన్ని రద్దయిన మ్యాచ్‌లను చూడాల్సి వస్తుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!