రోహిత్ ఆరోగ్యంగా ఉండటం మంచిది వార్త…!

ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఇండియాను ప్రకటించినప్పటి నుండి… రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో మంగళవారం జరిగిన ముంబై ఇండియన్స్ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మైదానంలోకి దిగడంతో అతని ఫిట్‌నెస్ విషయంలో అనుమానాలు తొలగిపోయాయి.

దీనిపై టీం ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. “రోహిత్ గాయానికి సంబంధించి ఇంతకుముందు ఏది జరిగిందో పక్కన పెడితే, రోహిత్ శర్మ ఆరోగ్యంగా ఉన్నాడని అర్ధమవుతుంది. భారత క్రికెట్‌ కు ఇది గొప్ప వార్త అని నేను చెప్తాను” అని గవాస్కర్ జాతీయ మీడియాతో అన్నారు. కొన్ని కొన్ని గాయాల విషయంలో త్వరపడకుండా నిర్ణయం తీసుకుంటే మంచిది అని అతను అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే ఇండియాకు మంచిది అన్నాడు.