IPL 2023 : సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది? నెల రోజుల్లో నాలుగోసారి గోల్డెన్ డక్..

-

ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. గత రాత్రి ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ మధ్యన అరుణ్ జైట్లీ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో ఫలితం ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ నిర్ణీత ఓవర్ లలో 172 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. వార్నర్ మరియు అక్షర పటేల్ లు అర్థ సెంచరీలు సాధించారు.

ముంబై బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ చావ్లా మరియు బెహ్రేన్ డార్ప్ లో తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 173 పరుగుల టార్గెట్ లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఢిల్లీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని త్వరగా పడగొట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే.. ఈ మ్యాచ్‌ లో కూడా సూర్య కుమార్‌ యాదవ్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయ్యాడు. మరోసారి డక్‌ తో వెనుదిరిగాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో సూర్య 0 (1), 0 (1), 0 (1), 15 (16), 1 (2), 0 (1) పరుగులు మాత్రమే చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news