టెస్టుల్లో నెంబర్ 1 స్థానానికి టీమ్ ఇండియా

-

ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ని వెనక్కి నెట్టి భారత జట్టు అగ్రస్థానానికి చేరింది. వార్షిక ర్యాంకింగ్ లకు మే 2020 – మే 2022ల మధ్య జరిగిన మ్యాచ్ లని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో గెలిచిన వారికి 100% మే 2022 తర్వాత విజయాలకు 50% పాయింట్లు కలుపుతారు. దీని ప్రకారం ఐసీసీ నేడు విడుదల చేసిన ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.

రెండవ స్థానంలో ఉన్న రోహిత్ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్ర పీఠాన్ని అధిరోహించింది. ఐపీఎల్ ఫైనల్ జరిగిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే లండన్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఎంతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా జట్టు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ ముందు భారత్ కి టాప్ ర్యాంక్ మంచి బూస్టప్ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news