డీకే శివకుమార్ కి తప్పిన పెను ముప్పు.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్

-

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ను హోసాకోట్ సమీపంలో డేగ ఢీకొట్టింది. ఎన్నికల ర్యాలీ కోసం ఆయన ములభాగీలుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డీకే శివకుమార్ కెమెరా పర్సన్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. డేగ ఢీకొట్టడంతో కాక్ పిట్ అద్దం పగిలిపోయింది.

వెంటనే హెలికాప్టర్ ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో హెలిక్యాప్టర్ లో శివ కుమార్ తో పాటు పైలట్, ఓ జర్నలిస్ట్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని.. అందరూ క్షేమంగానే ఉన్నారని కాంగ్రెస్ వెల్లడించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news