చెలరేగిన శిఖర్ ధావన్.. టీమిండియా స్కోరు 352

-

ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ అంటే ఎలా ఉంటది.. మామూలుగా ఉంటదా? రెండూ టఫ్ జట్లు. టఫ్ జట్ల మధ్య మ్యాచ్ కూడా టఫ్‌గానే ఉంటది. ఉండాలి కూడా. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. హైస్కోర్‌తో మ్యాచ్‌ను ముగించింది. 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు 353 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ చెలరేగిపోయాడు. 109 బంతుల్లో 117 పరుగులు తీసి టీమిండియా స్కోర్‌ను ఎక్కడికో తీసుకుపోయాడు. ధావన్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈసారి రాణించాడు. కోహ్లీ 82, రోహిత్ శర్మ 57 పరుగులు చేసి టీమిండియాకు హైస్కోర్‌ను అందించారు.

ఇప్పటి వరకు భారత్.. ఆస్ట్రేలియాతో 11 సార్లు వరల్డ్ కప్ మ్యాచుల్లో ఆడింది. వాటిలో మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మరి.. ఈమ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపిస్తుందా? లేదా చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version