రేపు ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ కు ఇంగ్లండ్ దేశం ఆతిథ్యం ఇస్తుండగా, రేపు తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 సమరం ప్రారంభానికి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ కప్ కోసం ఆయా దేశాలకు చెందిన జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లను ఆడిన అన్ని దేశాలు తమ బలాలు, బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమిస్తూ.. ప్రత్యర్థి జట్లకు చెందిన బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టేందుకు వ్యూహాలు పన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లు జరగడమే తరువాయి.. ఆయా జట్లన్నీ యుద్ధంలోకి దూకే సైనికుల్లా పోరాటం చేయనున్నాయి.
రేపు ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ కు ఇంగ్లండ్ దేశం ఆతిథ్యం ఇస్తుండగా, రేపు తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ కు చెందిన లీగ్ మ్యాచులు జూలై 6వ తేదీ వరకు రోజూ కొనసాగనున్నాయి. అనంతరం జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు, జూలై 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. ఇక లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. అవన్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతాయి. అనంతరం టాప్ 4 లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి. కాగా భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఆడనుండగా, అందులో ఇండియా జట్టు సౌతాఫ్రికాను ఢీకొననుంది. అలాగే భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో జూన్ 16వ తేదీన మ్యాచ్ ఆడనుంది.
కాగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుండగా, భారత్ ఆడే మ్యాచులు డీడీ చానల్‌లోనూ ప్రసారం అవుతాయి. ఇక చాలా వరకు మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతాయి. కేవలం కొన్ని మ్యాచ్‌లు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచ కప్‌కు చెందిన పూర్తి షెడ్యూల్ ను కింద చూసి తెలుసుకోవచ్చు..!
[pdf-embedder url=”https://manalokam.com/wp-content/uploads/2019/05/World2019-schedule.pdf” title=”ICC world cup 2019 schedule”]