ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై చంద్రబాబు స్పందన ఏంటో తెలుసా?

-

ఇవి తను చేసిన తప్పును కవర్ చేసుకునే మాటలని… తెలంగాణ ప్రభుత్వంతో దీనికి ఏంటి సంబంధం.. టీడీపీ అధ్యక్షుడై ఉండి.. చంద్రబాబు.. అలంకరణ విషయం చూసుకోవాలి కానీ.. ప్రభుత్వం మీద నెట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓడిపోగానే.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నే చంద్రబాబు మరిచిపోయారని.. అందుకే.. ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించలేదని వార్తలు వచ్చాయి.

తర్వాత జూనియర్ ఎన్టీఆరే.. పూలు తెప్పించి ఘాట్ ను అలంకరించి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం తనే ఎన్టీఆర్ వర్థంతి, జయంతి నిర్వహణ బాధ్యతను చూసుకుంటానని ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఎన్టీఆర్ ఘాట్ అలంకరణపై తాజాగా టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ జయంతి రోజున ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ విషయాన్ని చూసుకుంటుందని చంద్రబాబు తెలిపారు.

తెలంగాణ టీడీపీ నేతలు.. ఎన్టీఆర్ ఘాట్ అలంకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని… ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఘాట్ ను అలంకరిస్తుందని తాను భావించినట్టు చంద్రబాబు తెలిపారు.

అయితే.. ఇవి తను చేసిన తప్పును కవర్ చేసుకునే మాటలని… తెలంగాణ ప్రభుత్వంతో దీనికి ఏంటి సంబంధం.. టీడీపీ అధ్యక్షుడై ఉండి.. చంద్రబాబు.. అలంకరణ విషయం చూసుకోవాలి కానీ.. ప్రభుత్వం మీద నెట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని వేరే వాళ్ల మీదికి నెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. అలాగే ఎన్టీఆర్ ఘాట్ వివాదాన్న కూడా తెలంగాణ ప్రభుత్వంపై రుద్దుతున్నారని అనుకుంటున్నారు.

అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version