టెన్నిస్​కు స్టార్ ప్లేయర్ గుడ్ బై..!

-

అమెరికా టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ రిటైర్మెెంట్​ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. టెన్నిస్​కు మెల్లమెల్లగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. యూఎస్ ఓపెన్ అనంతరం టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. 23 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించానని, టెన్నిస్​ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్​ మ్యాగజైన్​ విడుదల చేసింది. ఈ సందర్భంగా రిటైర్మెంట్​ అనే పదం తనకు ఇష్టం లేదని.. టెన్నిస్​కు దూరంగా ఉంటూ తనకిష్టమైన ఇతర విషయాల పట్ల దృష్టి సారిస్తానని ఆమె చెప్పింది.

ప్రస్తుత ప్రొఫెషనల్(ఓపెన్​ ఎరా)​ శకంలో అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు గెలిచింది సెరెనా విలియమ్స్​. ఈ ఘనత మరే టెన్నిస్​ క్రీడాకారుడికి కూడా సాధ్యం కాలేదు. రికార్డు స్థాయిలో 23 గ్రాండ్​స్లామ్​లు సొంతం చేసుకుంది అమెరికా నల్లకలువ. ఆల్​టైమ్​ అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించిన రికార్డు మార్గరెట్​ కోర్ట్​(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఆమె మొత్తం 24 టైటిళ్లు గెల్చుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news