క్రికెట్ అభిమానులు అంటే వాళ్ళు…!

-

మన దేశంలో క్రికెట్ విషయంలో జనం కాస్త అతి చేస్తూ ఉంటారు కదా… క్రికెట్ ని ప్రాణంగా చూస్తూ ఉంటారు జనం. జట్టు ఓడిపోతే నానా మాటలు అంటారు. అసలు ప్రాణం పోయినట్టే చూస్తారూ. అన్ని మ్యాచులు గెలిచి ఒక మ్యాచ్ గెలవకపోతే మిడిల్ ఆర్డర్ బాగోలేదు, టాప్ ఆర్డర్ బాగోలేదు, బౌలింగ్ లేదు. బాల్ విసరడం రావడం లేదు, విసిరినా వికెట్లకు తగలట్లేదు అంటూ మాట్లాడుతూ ఉంటారు.

ఇది మరీ అతిగా ఉంటుంది కదూ… సోషల్ మీడియా వచ్చాకా ఈ పులిహోర మరింత ఎక్కువైపోయిందిలెండి. కాని న్యూజిలాండ్ జట్టు విషయంలో మాత్రం అలా లేదు. ఆ దేశ ఆటగాళ్ళను అక్కడి అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం భారత్ తో ఒక సీరీస్ ఆడుతుంది. ఈ సీరీస్ లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయారు బ్లాక్ క్యాప్స్. సూపర్ ఓవర్లో ఓటమి వెక్కిరించింది.

మూడో మ్యాచ్ నాలుగో మ్యాచ్ గెలిచినట్లే గెలిచి ఓడిపోయారు. అప్పటి వరకు పోరాడి ఆఖర్లో తడబడ్డారు. దీనితో అక్కడి అభిమానులు, మీరు పోరాడారు… ఫలితం మీరు నిర్ణయించలేరు. దానికి అద్రుష్టం కూడా ఉండాలి. పోరాడి ఓడిపోతే మాకు గర్వంగా ఉంది… పోరాడకుండా ఓడిపోతే మేము అవమాన పడే వాళ్ళం. మీరు ఇంకా బాగా ఆడాలి. ఈ రెండు మ్యాచులే మన లైఫ్ కాదు కదా… అంటూ అక్కడి ఫాన్స్ వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. డోంట్ వర్రీ వీ ఆర్ విత్ యు… ఫోకస్ ఆన్ నెక్స్ట్ మ్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news