దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె (100 బ్యాటింగ్: 169 బంతుల్లో 14×4, 1×6) సెంచరీ సాధించి, అవుట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోర్ 224/3 నుంచి రెండో రోజు ఆటను ప్రారంభించిన రహానే, రోహిత్ ల జోడీ, సగటున ఓవర్ కు 4.5 పరుగుల చొప్పున సాధిస్తూ, దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 11వ సెంచరీని పూర్తి చేసుకున్న రహానే 115 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మరో ఎండ్ లో పాతుకుపోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం 167 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతూ, మరో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రహానే అవుటైన తరువాత రవీంద్ర జడేజా వచ్చి రోహిత్ కు జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 75.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 306 పరుగులు.